Monday, August 24, 2009

The Poem I liked

The poem published below is a telugu poem appeared in Andhra Jyothi Daily on 24 Aug, 2009. I have not taken permission from the author to publish it in my blog. My intention is not to publish this poem as mine. But to share this poem with my friends. I think the writer of the poem Devi Yadagiri appreciates it.
Here is the poem. Read and comment:-



కాళివా .........బేలవా ....... !



చేతులు కాలి బొబ్బల్లేవకముందే
ఆకులు పట్టుకోవాలి సొదరీ ........
ప్రియుడి ఇంటి ముందు భైఠాయిన్పులు
మౌన పోరాటాలు, నిరాహారదీక్షలు కాదు ..
వాడి ప్రేమ ఎంత నిఖార్సయ్యిందో
నీ చనువే వాడి దారిలో పూలు చల్లిందో
అసలది ప్రేమో వ్యామోహమో
కరాఖండీగా నిర్ధరించుకోవాల్సింది నువ్వే
ముచ్చటపడి రేకులన్ని విచ్చుకొని
అలలు అలలుగా మధు సందేశాలు
అందించిన పిమ్మటేగా
తుమ్మెద వచ్చి పూవుపై వాలింది ...!
పురుగూ బుసీ తిని పుట్టలో తొంగున్నా
పోరగాడి చిత్తాన్ని తోక తొక్కి రెచ్చగొడితే
అది బుస్సుమని పడగ విప్పి ఖస్సుమని కాటేయదా
వేటగాడు బలవంతుడే కాని నువ్వు లేడి కూనవు కావు
కాళికా రూపిణివనే బిరుదాన్కితవు
ఇలా బేలగా నీరు కారిపోతే ఎలా ..!
కన్నె పిల్ల వొంపు సొంపులే
కళ్ళముందు మెరుపులు మెరిపిస్తాయి
దానికితోడు కురచ దుస్తులా ..!
రక్షణ కవచాన్ని ఇలా నిర్లక్ష్యం చేస్తే
గాలి వాటంగా ఎగిరోచ్చే ముళ్ళు
ఆరిటాకును గాయ పరుస్తూనే వుంటాయి
గుత్తులను కత్తిరించటమే పరిష్కారమనుకొంటే
ఎన్ని కొడవల్లకని పదును పెడతావు ..
తరిగిపారెయ్యటానికది వంగపిన్దేమికాదు కాదు
ఆలికి అనుపాలన నొసగే గడుసరి
కడుపు నిండా తిండి లేకున్నా నిబ్బరాయించుకొనే పడతికి
మరుని తాపాన్నుంచి విముక్తిని ప్రసాదించే మగసిరి
తగదని తెలిసి
తగ్గుతున్ననేమో ననే అపోహతో
నిండు నూరేళ్ళు హాయిగా సాగే బంధాన్ని
విచ్చిన్నంగా చిత్రిన్చాలనే సంకల్పంతో
ఎందుకు ఇల్లెక్కి కోడై కూస్తున్నావు తల్లీ ..!
రెండు చేతులు కలవందే చప్పెట మొగదని తెలిసి
అభాండాల భాన్డాన్ని ఎందుకు కుమ్మరిస్తున్నావు
మగాడు స్త్రీ కన్నా సీలవంతుడు కాదనేది జగద్విదితమే
మ్రుగాడు దేహబలం అండ చూసుకొని
ఆడదాని సిగను మిన్నాగై చుట్టుకున్నాడు నిజమే
పుండు జాడ తెలిసికూడా
మందేక్కడెక్కడో పూస్తున్నావు ఎందుకని మరి
కుక్క కాటుకు చెప్పు దెబ్బే భేష్ ..
మగాడు తిరగక చెడుతాడు
ఆడది తిరిగి చేడుతుండానే జనసృతిని తిరగారాయి
వివక్ష దానంతటదే తోక ముడుస్తుంది ..!




No comments: